Mon Dec 23 2024 03:51:33 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సర్దార్
ఇక సర్దార్ ఓటీటీ టైమ్ వచ్చేసింది. ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సర్దార్ రెడీ అవుతున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్..
కార్తీ.. పేరుకి తమిళ హీరోనే అయినా తెలుగు ఆడియన్స్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తీ నటించిన యుగానికొక్కడు , ఆవారా, ఖాకీ, ఖైదీ సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలందుకున్నాయి. అన్న సూర్య లాగానే.. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్ లో నటించి.. భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత సర్దార్ తోనూ ప్రేక్షకులను అలరించాడు. అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్-కార్తి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సర్దార్. తెలుగు , తమిళ భాషల్లో విడుదలైన థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక సర్దార్ ఓటీటీ టైమ్ వచ్చేసింది. ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సర్దార్ రెడీ అవుతున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా అందుకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది ఆహా టీమ్. అక్టోబర్ 21న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా నవంబర్ 18నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవనుంది. కార్తీ సరసన రాశీఖన్నా, రజిష విజయన్ నటించగా.. సీనియర్ నటి లైలా ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. సర్దార్లో కార్తీ.. ఆరు రకాల గెటప్స్ లో కనిపించాడు.
Next Story