Sat Dec 21 2024 15:07:56 GMT+0000 (Coordinated Universal Time)
NC22 : నాగచైతన్య సినిమాలో వంటలక్క
చైతన్య చేస్తున్న మొదటి తమిళ-తెలుగు బై లింగువల్ మూవీ. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలో నటించబోయే ..
అక్కినేని నాగచైతన్య హీరోగా.. 22వ సినిమాను కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు డెరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది చైతన్య చేస్తున్న మొదటి తమిళ-తెలుగు బై లింగువల్ మూవీ. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలను విడుదల చేసింది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ లు ఈ సినిమాలో కనిపించనున్నారు. వీరితో పాటు బుల్లితెరపై వంటలక్కగా పేరుగాంచిన ప్రేమి విశ్వనాథ్ (దీప) ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కానుంది.
కార్తీక దీపం సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న పేమి.. NC22లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట. కృతిశెట్టి మరోసారి చైతూతో జోడి కడుతోంది. ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజ్ సంగీతం అందించనున్నారు. తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తర్వాతి షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది.
Next Story