Mon Dec 23 2024 08:17:27 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్‌ని త్వరగా రాజకీయాల్లోకి రమ్మంటున్న డాక్టర్ బాబు..
'కార్తీక దీపం' సీరియల్ లో డాక్టర్ బాబుగా ఫేమస్ అయిన నిరుపమ్ పరిటాల ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి..
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేస్తూ యాక్టింగ్ కెరీర్ లో ఫుల్ బిజీ అవుతున్నాడు. దీంతో రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటూ వస్తున్నాడు. గతంలో సినిమాలు చేస్తూనే టీడీపీ తరుపున ప్రచారం చేసి జై ఎన్టీఆర్ అనిపించుకున్నాడు. ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితులకు.. కొంతమంది ఎన్టీఆర్ ని రాజకీయాలు గురించి మాట్లాడాలని, పాలిటిక్స్ పై యాక్షన్ తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా టీవీ సీరియల్ నటుడు నిరుపమ్ పరిటాల కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 'కార్తీక దీపం' సీరియల్ లో డాక్టర్ బాబుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న నిరుపమ్.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ నిత్యామీనన్‌తో కలిసి 'కుమారి శ్రీమతి' అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఉన్న నిరుపమ్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు.
ఈ క్రమంలోనే తాజా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూలో నిరుపమ్.. తన యాక్టింగ్ కెరీర్, మూవీ ఛాన్స్‌లు, మంజులతో ప్రేమ వివాహం వంటి విషయాలను మాట్లాడాడు. ఇక ఈ ప్రోమో ఎండింగ్లో నిరుపమ్ ని విలేకరి.. "జూనియర్ ఎన్టీఆర్ ని ఏదైన ఒక విషయం అడగాలి అంటే ఏం అడుగుతావు?" అంటూ ప్రశ్నించింది.
ఇక ఈ ప్రశ్నకు నిరుపమ్ బదులిస్తూ.. "త్వరగా రాజకీయాల్లోకి రావాలి. వచ్చి ఏదొక మార్పు తీసుకు రావాలి" అని అడుగుతా అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిరుపమ్ విజయవాడకి చెందిన వ్యక్తి అని అందరికి తెలిసిన విషయమే. అందువలనే నిరుపమ్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది.
Next Story