Mon Dec 23 2024 16:13:29 GMT+0000 (Coordinated Universal Time)
కార్తికేయ 'బెదురులంక' మోషన్ పోస్టర్ రిలీజ్..శివుడొచ్చాడ్రా
ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా హిట్ కొట్టలేకపోయాడు. నాని చేసిన గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా..
టాలీవుడ్ హీరో కార్తికేయ పేరువినగానే గుర్తొచ్చేది 'ఆర్ ఎక్స్ 100' సినిమా. హీరోగా తొలి సినిమాతో హిట్ అందుకున్న కార్తికేయ.. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా హిట్ కొట్టలేకపోయాడు. నాని చేసిన గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా ఫర్వాలేదనిపించాడు. తమిళంలో చేసిన 'వలిమై' నిరాశపరిచింది. ఆ తర్వాత కార్తీకేయ నెక్ట్స్ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. సడెన్ గా కొద్దిసేపటిక్రితం.. కార్తీకేయ హీరోగా 'బెదురులంక 2012' టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను వదిలారు.
'వచ్చాడ్రా .. శివుడొచ్చాడ్రా' అనే ఒక నినాదంతో మోషన్ పోస్టర్ ను వదిలారు. కాగా.. మోషన్ పోస్టర్ రిలీజ్ కొత్తగానే ఉన్నా.. ఈ సినిమా కాన్సెప్ట్ పై సస్పెన్స్ నెలకొంది. సినిమా కథేంటన్నది రివీల్ చేయలేదు. రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్న ఈ సినిమాకి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, నేహా శెట్టి కార్తికేయ సరసన కథానాయికగా కనిపించనుంది.
Next Story