Mon Dec 23 2024 08:51:51 GMT+0000 (Coordinated Universal Time)
రూ.100 కోట్ల క్లబ్ లోకి నిఖిల్ ఎంట్రీ.. కార్తికేయ 2 18 రోజుల కలెక్షన్ల వివరాలివి !
తొలి ఆటలోనే పాజిటివ్ టాక్ రావడంతో.. మూడ్రోజుల్లోనే లాభాల బాట పట్టింది. ఆంధ్రా, నైజాంలో కార్తికేయ 2 రూ.12 కోట్లు..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ - అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో చందూ మొండేటి దర్శకత్వంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన సినిమా కార్తికేయ 2. ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా, ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. సినిమా విడుదలై 18 రోజులైనా ఇంకా ప్రేక్షకాదరణ తగ్గలేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలో కూడా భారీగా ప్రేక్షకులను ఆకట్టుకొంటూ వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.12.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో రూ.13.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.
తొలి ఆటలోనే పాజిటివ్ టాక్ రావడంతో.. మూడ్రోజుల్లోనే లాభాల బాట పట్టింది. ఆంధ్రా, నైజాంలో కార్తికేయ 2 రూ.12 కోట్లు, సీడెడ్ లో రూ.4.6 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.4.11 కోట్లు, తూ.గో జిల్లాలో రూ.2.37 కోట్లు, ప.గో జిల్లాలో రూ.1.52 కోట్లు గుంటూరు జిల్లాలో 2.52 కోట్లు రాబట్టింది. ఇక కృష్ణా జిల్లాలో 2.04 కోట్లు, నెల్లూరులో 99 లక్షలు వసూళ్లను నమోదు చేసింది. తెలుగేతర రాష్ట్రాల వసూళ్ల వివరాలను చూస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2.65 కోట్లు, ఓవర్సీస్లో 5.64 కోట్లు, ఉత్తర భారతంలో 12.15 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50.66 కోట్ల షేర్, 101 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మొత్తానికి కార్తికేయ 2 రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. టాలీవుడ్ లో రూ.100 కోట్ల క్లబ్ లో ఉన్న హీరోల లిస్టులో ఇప్పుడు నిఖిల్ పేరు కూడా చేరింది. రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, వెంకటేష్, వరుణ్ తేజ్, బాలయ్య లతో పాటు ఇప్పుడు నిఖిల్ కూడా రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక చిన్న సినిమా ఇంతపెద్ద మొత్తం కలెక్షన్లు రాబట్టడం ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
News Summary - kartikeya 2 18 days collections details here
Next Story