Mon Dec 23 2024 09:10:05 GMT+0000 (Coordinated Universal Time)
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న కార్తికేయ - 2.. కలిసొచ్చిన సెలవులు
కేవలం వీకెండ్లోనే కాకుండా.. మంగళ, బుధ, గురువారాల్లో కూడా సినిమాకు మంచి బుకింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో..
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు భారీగా ఆదరణ లభిస్తోంది. మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వారంరోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.60.12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
గతవారం విడుదలైన ఈ సినిమాకు ఆదివారం, పంద్రాగస్టు, కృష్ణాష్టమి సెలవులు కలిసొచ్చాయనే చెప్పాలి. కేవలం వీకెండ్లోనే కాకుండా.. మంగళ, బుధ, గురువారాల్లో కూడా సినిమాకు మంచి బుకింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో 50 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా వారంరోజుల్లో 3000 స్క్రీన్లకు పెరగడం ఆశ్చర్యపరుస్తోంది. శ్రీ కృష్ణుడికి సంబంధించిన కథ కావడంతో హిందీ జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. రక్షాబంధన్, లాల్ సింగ్ చడ్డా సినిమాలు ఫ్లాప్ అవడం కార్తికేయ 2 కు కలిసొచ్చింది. నిఖిల్ నటించిన సినిమాల్లో ఇప్పటివరకూ ఎక్కడికి పోతావు చిన్నవాడా రూ.16.55 కోట్ల వసూళ్లతో మొదటిస్థానంలో ఉండేది. తాజాగా కార్తికేయ 2 సినిమా రూ.60.12 కోట్లు వసూలు చేయడంతో ఆ స్థానంలోకి వచ్చింది.
Next Story