Mon Dec 23 2024 23:08:32 GMT+0000 (Coordinated Universal Time)
RX100 సీక్వెల్ ఉంటుందా..? బెదురులంక 2012 మూవీ ఇంటర్వ్యూలో కార్తికేయ కామెంట్స్..!
హీరో కార్తికేయ కెరీర్ ని ఒక్క రాత్రిలో మార్చేసిన సినిమా RX100. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సినిమాకి సీక్వెల్ ఉంటుందా..? బెదురులంక 2012 మూవీ ఇంటర్వ్యూలో కార్తికేయ ఏం చెప్పాడు..?
టాలీవుడ్ యువ హీరో కార్తికేయ (Kartikeya Gummakonda).. RX100 సినిమాతో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఆ మూవీ సూపర్ సక్సెస్ అవ్వడంతో వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం హీరోగా చేస్తూనే విలన్ గా కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ హీరో బెదురులంక 2012 (Bedurulanka 2012) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆర్ఎక్స్100 సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్నకు కార్తికేయ బదులిచ్చాడు. "ఆ సీక్వెల్ ఉంటుందా? లేదా? అని చెప్పలేను, కానీ ఆ మూవీ డైరెక్టర్ అజయ్ భూపతితో మాత్రం మరో సినిమా కచ్చితంగా ఉంటుంది. తను ఆల్రెడీ నాకు కొన్ని కథలు వినిపించాడు. స్టోరీ ఫైనల్ అవ్వగానే మా కాంబినేషన్ లో రెండో సినిమా ప్రకటిస్తాం. అది RX100 కి సీక్వెల్ అవుతుంది అని మాత్రం నేను చెప్పలేను" అంటూ వెల్లడించాడు.
కార్తికేయ మాటలు వింటుంటే ఆర్ఎక్స్100 సీక్వెల్ ఉండకపోవచ్చు అనే అనిపిస్తుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఈసారి ఎటువంటి మూవీ రాబోతుందో చూడాలి. కాగా అజయ్ భూపతి ప్రస్తుతం తన ఆర్ఎక్స్100 హీరోయిన్ పాయల్ రాజ్పుత్(Payal Rajput) ని మెయిన్ లీడ్ పెట్టి 'మంగళవారం' అనే ఒక థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
ఇక కార్తికేయ బెదురులంక 2012 విషయానికి వస్తే.. 2012 యుగాంతం అంటూ అప్పటిలో ఒక రూమర్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ రూమర్ ని కథాంశంగా తీసుకోని కామెడీ నేపథ్యంతో గోదావరి బ్యాక్డ్రాప్ లో కొత్త డైరెక్టర్ క్లాక్స్ ఈ మూవీని తెరకెక్కించాడు. నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ శుక్రవారం ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
Next Story