Mon Dec 23 2024 07:33:07 GMT+0000 (Coordinated Universal Time)
రణబీర్ - అలియా పెళ్లి ఫొటోలపై కత్రినా స్పందన ఇదే !
అలియా తన ఇన్ స్టా హ్యాండిల్ లో పెళ్లి ఫొటోలను షేర్ చేయగా.. సెలబ్రిటీలు, ప్రముఖులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు..
ముంబై : ఐదారేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతూ.. పలుమార్లు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చిన రణబీర్-అలియా ఎట్టకేలకు వివాహంతో ఒక్కటయ్యారు. నిన్న ముంబైలోని వాస్తు ఇంటిలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. వివాహం అనంతరం అలియా తన ఇన్ స్టా హ్యాండిల్ లో పెళ్లి ఫొటోలను షేర్ చేయగా.. సెలబ్రిటీలు, ప్రముఖులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రణబీర్ మాజీ ప్రియురాలైన కత్రినా కైఫ్ కూడా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేసింది. అలియా భట్ పోస్ట్ చేసిన పెళ్లి ఫొటోపై స్పందిస్తూ.. 'ఇద్దరికీ శుభాకాంక్షలు. ఇద్దరూ అన్యోన్యంగా, సంతోషంగా ఉండాలి' అని విషెస్ తెలిపింది. కత్రినా-రణబీర్ దాదాపు ఆరేళ్లు రిలేషిప్ లో ఉన్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోగా.. గతేడాది డిసెంబర్ లో హీరో విక్కీ విశాల్ ను కత్రిన పెళ్లాడింది.
Next Story