Mon Dec 23 2024 13:14:32 GMT+0000 (Coordinated Universal Time)
చీరకట్టులో మల్లీశ్వరి..నేడే కత్రినా - విక్కీ ల వివాహం
నేడు రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ బర్వారా కోట లో కత్రినా - విక్కీల వివాహం జరగనుంది
కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలిన బాలీవుడ్ స్టార్ లవ్ కపుల్ ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. ఏడాది నుంచి పెళ్లిచేసుకునేందుకు అనువైన సమయం కోసం వేచి చూసిన ఈ లవ్ బర్డ్స్ కు ఆ సమయం రానే వచ్చింది. నేడు రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ బర్వారా కోట వీరిద్దరి వివాహానికి వేదికగా మారనుంది. కత్రినా - విక్కీల పెళ్లికోసం కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఈవెంట్ నిర్వాహకులు.
ఫొటోలు వైరల్.....
కాగా.. ఈ నూతన వధూవరుల ఫొటోలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకలు ప్రారంభమవ్వగా.. కత్రినా పెళ్లి కూతురిగా చీరకట్టులో మెరిసిపోతోంది. గ్రీన్ శారీలో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విక్కీ - కత్రినా ల వివాహం అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ.. పెళ్లి ఫొటోలు ఏమాత్రం లీక్ అవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.
Next Story