కౌశల్ సీన్ రివర్స్ అయ్యింది..!
గత ఏడాది ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మొదలైంది బిగ్ బాస్ సీజన్ 2. మధ్యలో కౌశల్ ఆర్మీ అంటూ బయట ఒక ఆర్మీ ఫామ్ అయ్యి.. హౌస్ [more]
గత ఏడాది ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మొదలైంది బిగ్ బాస్ సీజన్ 2. మధ్యలో కౌశల్ ఆర్మీ అంటూ బయట ఒక ఆర్మీ ఫామ్ అయ్యి.. హౌస్ [more]
గత ఏడాది ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా మొదలైంది బిగ్ బాస్ సీజన్ 2. మధ్యలో కౌశల్ ఆర్మీ అంటూ బయట ఒక ఆర్మీ ఫామ్ అయ్యి.. హౌస్ లో ఉన్న కౌశల్ ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో చేసిన హంగామాతో కౌశల్ బిగ్ బాస్ విన్నర్ గా అవతరించిన సంగతి తెలిసిందే. కేవలం కౌశల్ ఆర్మీతోనే గెలుపొందిన కౌశల్ హౌస్ లోనే కాదు.. బయట కూడా బిగ్ బాస్ విన్నర్ గా వీర విహారం చేసాడు. హౌస్ లో ఒంటరిని అనే బిల్డప్ తోనే కౌశల్ గెలుపొందాడు. ఒకొనొక టైంలో బిగ్ బాస్ యాజమాన్యం కూడా కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ కి భయపడి అతనికి టైటిల్ ఇచ్చేసిందనే టాక్ సోషల్ మీడియాలో నడిచింది. ఇక కౌశల్ ఆర్మీ ఫేక్ ఆర్మీ అంటూ తోటి కంటెస్టెంట్ బయటికొచ్చాక మొత్తుకున్నా కౌశల్ మాత్రం ఒప్పుకోలేదు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా బయటికొచ్చాక కూడా బోలెడంత బిల్డప్ ఇస్తూ.. కౌశల్ ఆర్మీ పేరుతో హడావిడి చెయ్యడమే కాదు.. బిగ్ బాస్ టైటిల్ ని ఉపయోగించుకోవాలని చాలా తాపత్రయపడ్డాడు కౌశల్. మొదట కొన్ని ఓపెనింగ్స్ కి పిలిచిన వ్యాపార సంస్థలు తర్వాత కౌశల్ ని పట్టించుకోలేదు.
షాకిచ్చిన కౌశల్ ఆర్మీ
ఇక తనకు పీఎంఓ కార్యాలయం నుండి ఫోన్ వచ్చేందని.. అలాగే గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారని చెప్పుకున్నాడు. అయితే ఇప్పుడు కౌశల్ కు కౌశల్ ఆర్మీనే షాకిచ్చింది. కౌశల్ ఆర్మీనే.. కౌశల్ మోసగాడని, తన స్వార్ధం కోసమే పని చేస్తాడు కానీ ఎవరికీ ఉపయోగపడే మనస్తత్వం కాదని.. కౌశల్ వలన తాము నష్టపోయామని ఛానల్స్ లోకి ఎక్కి మొత్తుకుంటున్నారు. కానీ కౌశల్ మాత్రం తాను బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉన్నానో… ఇప్పుడు అలానే ఉన్నానని.. ఎప్పుడూ తనకి తానులా ఉన్నానని.. కానీ కావాలనే కొందరు తన ప్రతిష్టని కిందకి దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని.. కౌశల్ ఆర్మీలోనే కొందరు కావాలనే తన మీద లేనిపోని నిందలు వేస్తున్నారని వాధిస్తున్నాడు కౌశల్.