Sat Jan 04 2025 12:23:26 GMT+0000 (Coordinated Universal Time)
Keerthy Suresh ఎట్టకేలకు స్పందించిన కీర్తి సురేష్.. అభిమానులు హ్యాపీనే!!
మ్యూజిక్ కంపోజర్‌తో కీర్తి పెళ్లి చేసుకోబోతుందనే పుకార్లు
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన కొత్త చిత్రం 'రఘు తాత' కోసం ప్రమోషన్లను మొదలు పెట్టింది. సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రమోషన్స్ సమయంలో కీర్తి సురేష్ తన పెళ్లి మీద వస్తున్న రూమర్లపై స్పందించింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె అభిమానులతో మాట్లాడుతున్నప్పుడు.. మీ కంటే 20 ఏళ్లు పెద్ద దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్ల గురించి స్పందించాలని ఒక వ్యక్తి అడిగారు. ప్రముఖ తమిళ మ్యూజిక్ కంపోజర్‌తో కీర్తి పెళ్లి చేసుకోబోతుందనే పుకార్లు కూడా వచ్చాయని తెలిపారు.
"మనం క్లారిటీ ఇస్తే నిజం అబద్ధం అవుతుంది, క్లారిటీ ఇస్తే రూమర్ కూడా నిజమవుతుంది'' అని కీర్తి చెప్పుకొచ్చింది. నా కెరీర్ గురించి, నా పాత్రల గురించి ఎవరైనా వివరణాత్మకంగా విమర్శలు చేస్తే వాటిని తప్పకుండా స్వీకరిస్తానని తెలిపింది. విమర్శల వల్ల జాగ్రత్త పడొచ్చని.. కొత్త విషయాలు తెలుసుకోవచ్చని కీర్తి చెప్పింది. అయితే నా వ్యక్తిగత విషయాల గురించి కామెంట్ చేస్తే మాత్రం అస్సలు పట్టించుకోను.. పరిగణనలోకి తీసుకోను కూడా. ఒకవేళ పొరపాటున పట్టించుకుంటే, మీరంతా కలిసి ఆ అబద్ధాన్ని నిజం చేసేస్తారని జాతీయ అవార్డు గ్రహీత తెలిపింది. ప్రతికూలతకు బలాన్ని ఇవ్వకూడదని అనుకుంటూ ఉంటానని.. తన వ్యక్తిగత జీవితం లేదా తన కుటుంబంపై ఎలాంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వనని కీర్తి తెలిపింది. తాను పెళ్లి చేసుకోబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.
Next Story