Wed Dec 25 2024 13:25:27 GMT+0000 (Coordinated Universal Time)
అల్లు అర్జున్ కు కేరళ ప్రభుత్వం ఆహ్వానం
కేరళ సినీ ప్రేక్షకుల్లో తెలుగు నటుల్లో ఎవరికీ లేనంత క్రేజ్ అల్లు అర్జున్ కి ఉంది. ఆర్య సినిమా నుంచి అల్లు అర్జున్ నటించిన ప్రతీ సినిమా కేరళలో హిట్ అవుతున్నాయి. దీంతో మళయాళీ ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ కి అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ఇక కాలేజీ క్యాంపస్ లలో అయితే బన్నీ క్రేజ్ మరింత ఎక్కువ. ఇక ఇటీవల కేరళ వరదలతో కష్టకాలంలో ఉంటే అల్లు అర్జున్ తనవంతు ఆర్థిక సహాయం అందించి మరింత అభిమానులను పెంచుకున్నారు. ఇక తాజాగా కేరళ ప్రభుత్వ అల్లు అర్జున్ ని ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో అలప్పిలో నవంబర్ 10న జరగనుంది. మరి, మన తెలుగు హీరో కేరళ ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా వెళుతున్నారంటే గొప్ప విషయమే.
Next Story