Mon Dec 23 2024 11:15:33 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలో కేజీఎఫ్ 2 చూడాలనుకుంటున్నారా ? రెంటల్ ప్లాన్స్ ఇవీ !
2018లో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF సినిమాకు సీక్వెల్ గా KGF చాప్టర్ 2 వచ్చింది. మొదటి భాగం కంటే ఈ సినిమాలో
కేజీఎఫ్-2 సినిమా ప్రస్తుతం బాక్సాఫీసును షేక్ చేస్తూ ఉంది. యష్ హీరోగా నటించిన ఈ సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడుతున్నారు. KGF 2 విడుదలై ఇన్ని వారాలు అయినా కూడా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. అర డజను బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. అంతో ఇంతో 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' అనే హాలీవుడ్ సినిమాకు కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా 1200.76 కోట్లకు చేరుకుంది. ఏకంగా 1200 కోట్ల మైలురాయిని దాటింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అద్దెకు అందుబాటులో ఉంది. ప్రైమ్ వీడియోలో 'మూవీ రెంటల్స్' విభాగంలో కేజీఎఫ్-2 ను మనం చూడవచ్చు. సోమవారం నుండి ప్రైమ్ మెంబర్లు, నాన్-ప్రైమ్ మెంబర్లు ఇద్దరూ సినిమాని ప్రైమ్ వీడియోలో రూ.199కి అద్దెకు తీసుకునే అవకాశం ఇచ్చారు. ఈ పాన్-ఇండియా బ్లాక్బస్టర్ని ఇకపై స్వంత ఇళ్లలోనే ఆనందించవచ్చు. ఈ చిత్రం కన్నడ, హిందీ, తమిళం, తెలుగు మరియు మలయాళం.. ఇలా ఐదు భాషలలో HD క్వాలిటీతో అద్దెకు అందుబాటులో ఉంటుంది.
2018లో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF సినిమాకు సీక్వెల్ గా KGF చాప్టర్ 2 వచ్చింది. మొదటి భాగం కంటే ఈ సినిమాలో మరిన్ని ఎలివేషన్స్ ఉండడం.. వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ నటించడంతో మరింత పబ్లిసిటీ వచ్చింది. ఒక్క కర్ణాటకలోనే కాకుండా దేశం మొత్తం సినిమా ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు, అచ్యుత్ కుమార్, అర్చన జోయిస్ కూడా నటించారు. KGF చాప్టర్ 2ని హోంబలే ఫిల్మ్స్పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
Next Story