Mon Dec 23 2024 10:43:31 GMT+0000 (Coordinated Universal Time)
రక్తంతో రాసిన కథ ఇది.. కేజీఎఫ్ 2 ట్రైలర్ !
తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయగా.. తమిళ్ ట్రైలర్ ను సూర్య, మలయాళంలో హీరో పృథ్విరాజ్..
బెంగళూరు : కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ ఎట్టకేలకు గ్రాండ్ గా విడుదలైంది. ఈ ట్రైలర్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. కేజీఎఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలున్నాయి. ఈ ట్రైలర్ ను అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలు విడుదల చేయడం విశేషం.
తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయగా.. తమిళ్ ట్రైలర్ ను సూర్య, మలయాళంలో హీరో పృథ్విరాజ్ సుకుమారన్, కన్నడలో స్టార్ హీరో శివరాజ్ కుమార్ లు లాంచ్ చేశారు. హిందీలో డైరెక్టర్, నటుడు ఫరాన్ అక్తర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదలైన కొద్దినిమిషాల్లోనే లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో.. సినిమాపై మరింత హైప్ ను పెంచేశారు మేకర్స్. నాకు వయోలెన్స్ నచ్చదంటూనే.. వయోలెన్స్ తనను వదలట్లేదంటాడు హీరో. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాపంగా అభిమానులముందుకు రానుంది.
Next Story