కెజిఎఫ్ లో కంటెంట్ స్ట్రాంగ్ అంట..!
ఈ శుక్రవారం పలు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వరుణ్ తేజ నటించిన 'అంతరిక్షం', శర్వానంద్ 'పడి పడి లేచే మనసు'తో పాటు కన్నడ మూవీ 'కెజిఎఫ్' కూడా రిలీజ్ అవుతుంది. వాస్తవానికి ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో అంతగా బజ్ లేదనే చెప్పాలి. కన్నడలో స్టార్ ఇమేజ్ ఉన్న యష్ ఈ సినిమాను కన్నడతో పాటు.. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు కన్నడలో ఏ సినిమా ఇన్ని భాషల్లో రిలీజ్ అవ్వలేదు. తెలుగులో ఈ సినిమాకు అనుకున్నంత బజ్ లేదు. మొదటి రెండు మూడు రోజుల్లో అంతా 'పడి పడి లేచే మనసు', 'అంతరిక్షం' వైపు మొగ్గు చూపుతారు. 'కెజిఎఫ్' మీద అంత ఇంట్రెస్ట్ చూపరు. కానీ రెండుమూడు రోజుల తరువాత ఈ సినిమా పుంజుకోవడం ఖాయమని, దానికి కారణం ఇందులో ఉన్న యునీక్ కంటెంట్ అని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో హీరో యాష్ నటన అందరినీ ఆకట్టుకుంటదని... పైగా యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని భావిస్తున్నారు.
కన్నడలో హిట్ అవడం ఖాయం...
కోలార్ బంగారు గనులు గురించి ఈ సినిమా ఉంటుంది. చాలామంది పొలిటీషియన్స్, రౌడీలు ఆ స్థలాన్ని ఆక్రమించుకోవాలి చూస్తుంటారు. ఆ టైంలో రాకీ అనే యువకుడు ఆ సామ్రాజ్యం కోటలను ఎలా బద్దలుకొట్టి దానికి చక్రవర్తిగా మారాడు అనేదే 'కెజిఎఫ్' కథ. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసాడు. ఇందులో కళ్ల చెదిరే సెట్స్ వేసినట్టు సమాచారం. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఇది కన్నడలో సూపర్ హిట్ అవ్వడం ఖాయం అన్నట్టు కనిపిస్తుంది. మరి అదే రోజు తెలుగులో రెండు స్ట్రెయిట్ మూవీస్, తమిళ మూవీ ఒకటి రిలీజ్ అవుతున్నాయి. మరి వీటిని దాటుకుని ఈ సినిమా బాక్సాఫీస్ చైర్ మీద కూర్చుంటాడేమో చూడాలి.