Mon Dec 23 2024 03:47:25 GMT+0000 (Coordinated Universal Time)
Yash : భార్య కోసం ఐస్ క్యాండీ.. రాత్రిపూట చిన్న షాప్‌లో యశ్..
భార్యకి ఐస్ క్యాండీ కొనడం కోసం రాత్రిపూట రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న షాప్‌కి వెళ్లిన కేజీఎఫ్ హీరో యశ్.
Yash : 'కేజీఎఫ్' సినిమాలతో వరల్డ్ వైడ్ గా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న యశ్.. రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటారు. ఆ సింప్లిసిటీనే ఎంతోమంది తనని అభిమానించేలా చేస్తుంది. పాన్ ఇండియా స్టార్ హోదా వచ్చినా.. ఇప్పటికి ఈ హీరో చేసే కొన్ని విషయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇటీవల తన అసిస్టెంట్ కి బాబు పుడితే.. అతని ఇంటికి సర్ప్రైజ్ గా వెళ్లి బాబుకి గోల్డ్ చైన్ బహుమతిగా ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా యశ్ చేసిన మరో పని కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా స్టార్ హీరోలు తమ భార్యలకు, ప్రియురాళ్లకు ఏమైనా కొనివ్వాలంటే సిటీస్ లో పెద్ద పెద్ద మాల్స్‌లో, లేదా ఫారిన్ కంట్రీస్ లో షాపింగ్ చేస్తుంటారు. కానీ మన రాకీ భాయ్.. తన భార్య రాధికకు ఐస్ క్యాండీ కొనివ్వడానికి రోడ్డు పక్కన ఉండే ఒక చిన్న షాప్ కి తీసుకు వెళ్లారు. కర్ణాటక భత్కల్‌లోని శిరాలి అనే గ్రామంలో ఉన్న చితపుర మాత దేవాలయాన్ని సందర్శించడానికి యశ్ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు.. రాత్రి సమయంలో ఇలా భార్య కోసం రోడ్డు పక్కన షాప్ లో యశ్ కనిపించారు.
తనకి ఉన్న స్టార్డమ్ ని పక్కనపెట్టి యశ్.. ఇలా సింపుల్ గా చిన్న షాప్ లో షాపింగ్ చేయడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక యశ్ నటిస్తున్న సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నారు. ప్రెజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. 2025 ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది.
Next Story