Thu Dec 26 2024 03:22:01 GMT+0000 (Coordinated Universal Time)
కేజీఎఫ్-3 తప్పకుండా ఉంటుంది.. విడుదల సమయాన్ని కూడా చెప్పేసిన నిర్మాత
కేజీఎఫ్-3 ఉండబోతోందని చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చేసారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఫ్రాంచైజీ మూడో భాగం ఉందని నిర్మాత ..
కేజీఎఫ్-1, కేజీఎఫ్- 2 సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్-2 బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపుతూ ఉంది. అయితే కేజీఎఫ్-2 తర్వాత సీక్వెల్ కు సంబంధించిన ఊహాగానాలు ఇన్ని రోజులూ వినిపించాయి. పార్ట్-2 ఎండింగ్ లో కూడా కేజీఎఫ్-3 కి సంబంధించిన హింట్స్ ఇచ్చారు.
తాజాగా కేజీఎఫ్-3 ఉండబోతోందని చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చేసారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఫ్రాంచైజీ మూడో భాగం ఉందని నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపారు. KGF: చాప్టర్ 3 ఉంటుందని తేల్చి చెప్పారు. మూడో భాగం 2024లో విడుదలవుతుందని కిరగందూర్ ధృవీకరించారు. చిత్రనిర్మాతలు కొత్త పాత్రలతో "మార్వెల్-స్టైల్" యూనివర్స్ ను సృష్టించాలని యోచిస్తున్నారని తెలిపారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, కిరగందూర్ KGF: చాప్టర్ 3 షూటింగ్ ఈ ఏడాది చివర్లో.. అక్టోబర్ తర్వాత ప్రారంభమవుతుందని వెల్లడించారు.
దైనిక్ భాస్కర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, "దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సాలార్ (ప్రభాస్ నటిస్తున్నారు) చిత్రంతో బిజీగా ఉన్నారు. దాదాపు 30-35% షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబరు తర్వాత KGF3 షూటింగ్‌ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. 2024 నాటికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాం'' అన్నారు. మేము ఒక మార్వెల్ లాంటి రకమైన విశ్వాన్ని సృష్టించబోతున్నాము. డిఫరెంట్ సినిమాల్లోని డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకొచ్చి సినిమాలను క్రియేట్ చేయాలనుకుంటున్నామన్నారు.
Next Story