Mon Dec 23 2024 03:51:50 GMT+0000 (Coordinated Universal Time)
Yash : యశ్ కొత్త సినిమా డైరెక్టర్.. గతంలో ఏ మూవీ చేశారో తెలుసా..?
కేజీఎఫ్ వంటి సక్సెస్ తరువాత యశ్ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్న దర్శకురాలు ఎవరు..? గతంలో ఏ మూవీ చేశారో తెలుసా..?
Yash : రాకింగ్ స్టార్ యశ్.. ఎట్టకేలకు తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. కేజీఎఫ్ వంటి భారీ విజయం తరువాత ఏడాదిన్నర పూర్తి అయినా.. యశ్ తన తదుపరి సినిమాని ప్రకటించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. తాజాగా రాకీభాయ్ తన ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ తన కొత్త సినిమాని అనౌన్స్ చేసేశారు. మూవీ డైరెక్టర్, టైటిల్, రిలీజ్ డేట్.. ఇలా అన్ని ఒకేసారి అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి అదిరిపోయే బహుమతి ఇచ్చారు.
గత కొంతకాలంగా యశ్.. మలయాళ మహిళా దర్శకురాలితో తన తదుపరి సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ.. గీతూ మోహన్ దాస్ తో తన 19వ సినిమాని ప్రకటించారు. ఇక ఈ మూవీకి 'టాక్సిక్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు తేదీని కూడా ఖరారు చేశారు. ఇక ఈ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. కాగా కేజీఎఫ్ వంటి భారీ సక్సెస్ తరువాత యశ్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్న ఆ దర్శకురాలు ఎవరు అసలు..?
గీతూ మోహన్ దాస్ 1986లో మలయాళ సినీ పరిశ్రమలో నటిగా తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 2009 వరకు నటిస్తూనే వచ్చారు. ఆ తరువాత నుంచి దర్శకురాలిగా టర్న్ తీసుకున్నారు. 2009లో ఒక షార్ట్ ఫిలిం తీశారు. 2014లో 'లైర్స్ డైస్' అనే హిందీ సినిమా డైరెక్ట్ చేసి పలు క్యాటగిరీల్లో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులను తెచ్చిపెట్టింది. 2019లో 'మూత్తోన్' అనే మూవీ తెరకెక్కించారు. అదికూడా ఇంటర్నేషనల్ అవార్డులు సొంతం చేసుకుంది.
ఈమె దర్శకురాలిగా కేవలం ఒక షార్ట్ ఫిలిం, రెండు సిల్వర్ స్క్రీన్ ఫిలిమ్స్ మాత్రమే తెరకెక్కించారు. మరి ఈ దర్శకురాలు పాన్ ఇండియా విజయం సాధించిన యశ్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది చూడాలి. టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే.. గ్యాంబ్లింగ్, జోకర్, మ్యాజిక్ నేపథ్యంతో సినిమా ఉండబోతుందా అని అనిపిస్తుంది.
Next Story