Mon Dec 23 2024 03:48:12 GMT+0000 (Coordinated Universal Time)
రవితేజ పై ఫైర్ అవుతున్న యశ్ ఫ్యాన్స్..
టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ లో ఉన్న రవితేజ 'కేజీఎఫ్' స్టార్ యశ్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ.. ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్ మూవీ పై మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. రవితేజ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుండడంతో బాలీవుడ్ లో కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రవితేజ చేసిన కామెంట్స్ ని 'కేజీఎఫ్' స్టార్ యశ్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.
ఇంతకీ రవితేజ ఏం కామెంట్స్ చేశాడు..? అసలు విషయం ఏంటంటే.. ఇంటర్వ్యూలో సౌత్ యాక్టర్స్ గురించి ఒక మాటలో చెప్పమని రవితేజని ప్రశ్నించారు. ఈక్రమంలోనే ఒక్కో హీరో పేరు చెబుతూ వస్తుండగా, వారి గురించి రవితేజ ఒక మాటలో చెబుతూ వచ్చాడు. అలా యశ్ గురించి అడగగా, రవితేజ బదులిస్తూ.. "తన సినిమాల్లో నేను కేజీఎఫ్ మాత్రమే చూశాను. ఆ మూవీ చేయడం తన లక్" అంటూ కామెంట్ చేశాడు. అయితే రవితేజ 'లక్' అన్న పదాన్ని యశ్ ఫ్యాన్స్ తప్పుగా అర్ధం చేసుకొని.. రవితేజ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో రవితేజ.. రామ్ చరణ్, ప్రభాస్, రాజమౌళి, తమిళ్ హీరో విజయ్ గురించి కూడా కామెంట్స్ చేశాడు. రామ్ చరణ్ డాన్స్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ కట్ అవుట్ అంటే ఇష్టమని, రాజమౌళి విజన్, విజయ్ డాన్స్ ఇష్టమని తెలియజేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయానికి వస్తే.. అక్టోబర్ 20న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు సైన్ లాంగ్వేజ్స్ లో కూడా రిలీజ్ కాబోతుంది. చెవులు వినిపించని వారికోసం సైన్ లాంగ్వేజ్ లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా 19వ శతాబ్దంలోని ఆంధ్రప్రదేశ్ స్టూవర్టుపురం ప్రాంతంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లైఫ్ స్టోరీ నేపథ్యంతో రాబోతుంది.
Next Story