Mon Dec 23 2024 03:23:58 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : 'సలార్'లో రాకీ భాయ్.. హింట్ ఇచ్చిన సింగర్..!
సలార్ సినిమాలో ప్రభాస్, యశ్, పృథ్వీరాజ్ కోసం పాట పాడాను అంటున్న బుల్లి సింగర్.
Salaar : కేజీఎఫ్ చిత్రాల తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్.. రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక రూమర్ అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. అదేంటంటే.. ఈ మూవీలో కేజీఎఫ్ హీరో రాకీభాయ్ కూడా కనిపించబోతున్నారట.
అయితే ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేజీఎఫ్, సలార్కి ఎటువంటి కనెక్షన్ లేదని చెప్పి అభిమానులను నిరాశ పరిచారు. అయితే తాజాగా ఒక బుల్లి సింగర్ మీడియాతో మాట్లాడుతూ.. "నేను సలార్ లో ప్రభాస్, యశ్, పృథ్వీరాజ్ సుకుమారన్ అంకుల్కి పాట పాడాను" అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలే ఆడియన్స్ లో ఆశలు చిగురించేలా చేస్తున్నాయి.
ఆ బుల్లి సింగర్ కామెంట్స్ ని ఆధారంగా చేసుకొని అభిమానులు ఇలా కామెంట్స్ చేస్తున్నారు.. "ప్రశాంత్ నీల్ సలార్, కేజీఎఫ్ కి మధ్య కనెక్షన్ లేదని చెప్పారు గాని. సలార్ లో యశ్ లేరని ఏమి చెప్పలేదు కదా" అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సందేహాలు నిజం అవుతాయా లేదా అనేది చూడాలి. కాగా ఈ మూవీ మొదటి భాగం ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో వేగం పెంచింది.
రీసెంట్ గా ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు. 'సూర్యుడే గొడుగు పట్టి' అనే ఫ్రెండ్షిప్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సృష్టిస్తుంది. ఈ సినిమాలో శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియారెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Next Story