Mon Dec 23 2024 03:15:10 GMT+0000 (Coordinated Universal Time)
మలయాళ దర్శకురాలితో హీరో యశ్ మూవీ?
కేజీఎఫ్ 2 రిలీజ్ తరువాత కూడా యశ్ ఇప్పటివరకు మరో మూవీ ప్రకటించలేదు. తాజాగా మలయాళ దర్శకురాలు..
కన్నడ రాక్ స్టార్ 'యశ్' (Yash).. కేజీఎఫ్ చిత్రాలతో ఇండియా వైడ్ భారీ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. రాకీ భాయ్ గా తన నటన ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. కేజీఎఫ్ 2 తో ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ మూవీని ఇచ్చిన తరువాత కూడా యశ్ ఇప్పటి వరకు మరో మూవీని అనౌన్స్ చేయలేదు. KGF2 రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అయ్యిపోయింది. కానీ యశ్ మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో అభిమానులంతా నిరాశ చెందుతున్నారు.
అయితే ఫ్యాన్స్ కి త్వరలో ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందని ఫిలిం వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తో యశ్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా వినిపిస్తూ వస్తున్న వార్త. ఇప్పుడు ఈ వార్తని నిజం చేస్తూ.. ఈ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించనున్నారని సమాచారం. యశ్ 19వ మూవీగా రాబోతున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్నదట.
గత కొంతకాలంగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతూ వస్తున్నాయి. యశ్ కూడా ఈ పనుల్లో పాల్గొంటూ వస్తున్నాడట. ఇప్పుడు ఈ వర్క్స్ అన్ని చివరిదశకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాది డిసెంబర్ లో ఈ మూవీని పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా గీతూ మోహన్‌దాస్ కి దర్శకురాలిగా రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. ‘లయర్స్ డైస్’, ‘మూతన్’ వంటి సినిమాలను తెరకెక్కించగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
మరి ఇప్పుడు ఈ దర్శకురాలితో యశ్ తన తదుపరి సినిమాని చేస్తుండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత.. టాప్ డైరెక్టర్ తో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేస్తాడు అని అందరూ భావించారు. అసలు గీతూ మోహన్‌దాస్ తో మూవీ ఎంత వరకు నిజమో తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాలి. యశ్ అభిమానులు మాత్రం.. ఏదొక సినిమా అప్డేట్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు.
Next Story