Fri Dec 20 2024 18:01:44 GMT+0000 (Coordinated Universal Time)
Salaar : సలార్లో కనిపించే ఖాన్సార్ సిటీ.. బయట ఎక్కడుందో తెలుసా..?
సలార్లో కనిపించే ఖాన్సార్ సిటీ రియల్ లైఫ్ లో ఉందా..? బయట అది ఎక్కడుందో తెలుసా..?
Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్స్ లో ప్రశాంత్ నీల్ రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'సలార్'. నేటి కాలంలో రాజ్య సింహాసనం కోసం జరిగే యుద్ధ కథతో ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం సీజ్ ఫైర్ నిన్న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని రాజ్యం పేరు 'ఖాన్సార్'. మూవీ స్టోరీ అంతా ఈ ఖాన్సార్ నగరం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
సినిమాలో ఈ ఖాన్సార్ నగరం గుజరాత్ దగ్గరిలో పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉన్నట్లు చూపించారు. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ నగరం నిజంగా బయట ఉందా అనే సందేహం మొదలైంది. మరి నిజంగానే ఆ నగరం రియల్ లైఫ్ లో ఉందా..? లేదా మూవీ కోసం ప్రశాంత్ నీల్ క్రియేట్ చేశారా..?
రియల్ లైఫ్ లో కూడా ఖాన్సార్ అనే నగరం ఉంది. అయితే సినిమాలో చూపించినట్లు అది పాకిస్తాన్ బోర్డర్ లో లేదు. ఇరాన్ దేశంలో ఆ నగరం ఉంది. ఆ నగరం పూర్తి పేరు ఖాన్సార్ కౌంటీ. ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో ఈ ఖాన్సార్ కౌంటీ ఉంది. ఈ నగరం సలార్ సినిమాలో చూపించిన నగరానికి పూర్తి బిన్నంగా ఉంటుంది. పచ్చని ప్రకృతి, మంచు పర్వతాలు, అందమైన లొకేషన్స్ తో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఖాన్సార్ కౌంటీలో దాదాపు 22 వేలకు పైగా పర్షియన్లు నివసిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక సలార్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 175 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం. ఇండియా వైడ్ ఈ సినిమా దాదాపు 89 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు తెలుస్తుంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ డే టాప్ గ్రాసర్ లిస్టులో స్థానం దక్కించుకోవడం గమనార్హం. మరి ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Next Story