Mon Dec 23 2024 08:33:24 GMT+0000 (Coordinated Universal Time)
2023లో పెళ్లిపీటలెక్కనున్న కియారా - సిద్ధార్థ్.. నిజమేనా ?
కియారా - సిద్ధార్ద్ కలిసి షేర్షా సినిమాలో నటించారు. 2021లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది.
2022 సంవత్సరం నేటితో ముగియనుంది. ఈ ఏడాదిలో చాలామంది స్టార్ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారు. నయన్-విగ్నేష్, విక్కీ-కత్రినా, అలియా-రణబీర్, మోహిత్ రైనా - అదితి, మౌనిరాయ్ - సూరజ్ నంబియార్, హన్సిక - సోహెల్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు 2022లో కపుల్స్ గా మారారు. తాజాగా.. మోస్ట్ అవైటెడ్ పెయిర్ గా ఉన్న కియారా అద్వానీ - సిద్ధార్ర్ మల్హోత్రా పెళ్లిపీటలెక్కబోతున్నారంటూ వార్తలొచ్చాయి. గతంలోనూ వీరి పెళ్లిపై వార్తలొచ్చాయి కానీ.. అవి వార్తలుగానే మిగిలిపోయాయి.
కియారా - సిద్ధార్ద్ కలిసి షేర్షా సినిమాలో నటించారు. 2021లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. అంతకన్నా ముందునుండే స్నేహితులైన వీరిద్దరూ.. షేర్షా తర్వాత ప్రేమలో పడినట్లు వార్తలు గుప్పుమన్నాయి కానీ.. వాళ్లు మాత్రం స్పందించలేదు. బీ టౌన్ వార్తలకు తగ్గట్టు.. అడపా పడపా పార్టీల్లో కలిసి కనిపించారు. 2023 ఫిబ్రవరి 5,6 తేదీల్లో ఈ ప్రేమజంట పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వెలువడ్డాయి.
ఫిబ్రవరి 4, 5 తేదీల్లో వివాహానికి సంబంధించిన హల్దీ, సంగీత్.. ఇతర కార్యక్రమాలు ముంబైలో జరుగుతాయని, వివాహం రాజస్థాన్ జైసల్మీర్ ప్యాలెస్ లో జరగనున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన లేనప్పటికీ.. ఈ పెళ్లి జరుగుతుందని ఖచ్చితంగా చెబుతోంది బాలీవుడ్. ఈసారైనా పెళ్లి చేసుకుంటారా లేక మళ్లీ వార్తలకే పరిమితమవుతుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Next Story