Mon Dec 23 2024 08:52:02 GMT+0000 (Coordinated Universal Time)
Kiara Advani : కియారా భర్త.. రాశితో క్లోజ్‌గా.. ఫ్యాన్స్ అసహనం..
కియారా అద్వానీ భర్త సిద్దార్థ్ మల్హోత్రా.. హీరోయిన్ రాశి ఖన్నాతో క్లోజ్‌గా కనిపించారు. ఈ విషయం పై..
Kiara Advani : బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మల్హోత్రా (Siddadharth Malhotra), కియారా అద్వానీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆన్‌స్క్రీన్ పై కలిసి నటించిన వీరిద్దరూ.. తమ కెమిస్ట్రీతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఇక ఆ కెమిస్ట్రీని ఆఫ్ స్క్రీన్ లో కూడా కొనసాగిస్తూ.. గత ఏడాది పెళ్లి జీవితాన్ని మొదలుపెట్టారు. పెళ్లి తరువాత వీరిద్దరి బాండింగ్ చూసి అభిమానులు తెగ సంతోష పడేవారు. పర్ఫెక్ట్ అండ్ లవ్లీ కపుల్ అంటూ ఫ్యాన్స్ తో పాటు నెటిజెన్స్ కూడా కితాబు ఇచ్చేవారు.
అయితే ఇప్పుడు ఆ అభిమానులే.. సిద్దార్థ్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిద్దార్థ్, కియారాతో ఉండాల్సినంత క్లోజ్‌గా.. రాశి ఖన్నాతో కనిపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే.. సిద్దార్థ్, రాశి, దిశా పటాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'యోధ'. ఈ మూవీ మార్చిలో విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర.. టీజర్ అండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్స్ తో సందడి చేస్తుంది.
ఈక్రమంలోనే రీసెంట్ గా మూవీలోని ఫస్ట్ సాంగ్ ని ఈవెంట్ పెట్టి లాంచ్ చేసారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దార్థ్, రాశి.. ఈవెంట్ వద్దకి వచ్చే సమయంలో చాలా క్లోజ్‌గా కనిపించారు. ఒకరి చేతులను ఒకరు పట్టుకొని ఆఫ్ స్క్రీన్ లో కూడా ప్రేమ జంటలా కనిపించారు. ఇక ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్.. 'సిద్దార్థ్, రాశి ఎందుకని కపుల్ లాగా ప్రవర్తిస్తున్నారు' అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కియారా ఫ్యాన్స్ అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Next Story