Mon Dec 23 2024 08:32:36 GMT+0000 (Coordinated Universal Time)
ఘనంగా కియారా-సిద్ధార్థ్ ల వివాహం.. ఇవిగో ఫొటోలు
త్వరలోనే ఢిల్లీ, ముంబైలలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతుందని సమాచారం. కాగా.. సిద్ధార్థ్ - కియారా తమ పెళ్లికి..
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లితో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7న రాజస్థాన్ జైసల్మేర్ లోని సూర్యఘఢ్ ప్యాలెస్ లో అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, అతిథుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జొహార్, షాహిద్ కపూర్, జూహీ చావ్లా, కియారా చిన్ననాటి స్నేహితురాలు ఈషా అంబానీ తదితరులు పెళ్లివేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పంజాబీ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లివేడుకలో అతిథులకు పలు దేశాలకు చెందిన వంటలను వడ్డించినట్లు సమాచారం.
త్వరలోనే ఢిల్లీ, ముంబైలలో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరుగుతుందని సమాచారం. కాగా.. సిద్ధార్థ్ - కియారా తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. వాటిలో ఇద్దరూ ఎంతో అందంగా, సంతోషంగా కనిపిస్తున్నారు. పెళ్లైన సందర్భంగా సిద్ధార్థ్ కియారాను ముద్దాడిన ఫొటో కూడా ఉంది. ‘‘ఇప్పుడు మేం శాశ్వతంగా బుక్ అయిపోయాము. మా ముందున్న ప్రయాణంలో మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’’ అని కియారా రాసుకొచ్చింది. 2021లో ‘షేర్షా’ సినిమాతో ఆన్స్క్రీన్ హిట్ పెయిర్గా నిలిచిన సిద్ధార్థ్-కియారాలు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Next Story