Mon Dec 23 2024 09:12:58 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కియారా - సిద్ధార్థ్ ల వివాహం.. జైసల్మేర్ కు అతిథులు
కియారా - సిద్ధార్థ్ ల వివాహానికి ఈషా తన భర్త ఆనంద్ పిరమళ్ తో కలిసి అక్కడికి చేరుకున్నట్టు నెట్టింట ఫొటోలు వైరల్..
ప్రముఖ బాలీవుడ్ ప్రేమ జంట అయిన కియారా అడ్వాణీ - సిద్ధార్థ్ మల్హోత్ర నేడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహానికి రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఉన్న సూర్యగ్రహ్ ప్యాలెస్ వేదికైంది. మరికొద్ది గంటల్లో ఈ ప్రేమ జంట వివాహం అంగరంగవైభవంగా.. పంజాబీ సంప్రదాయంలో జరగనుంది. ఈ వేడుకకు వెళ్లేందుకు.. స్నేహితులు, బంధువులు జైసల్మేర్ కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కియారా చిన్ననాటి స్నేహితురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ నిన్నరాత్రి జైసల్మేర్ చేరుకుంది.
కియారా - సిద్ధార్థ్ ల వివాహానికి ఈషా తన భర్త ఆనంద్ పిరమళ్ తో కలిసి అక్కడికి చేరుకున్నట్టు నెట్టింట ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటి కాబోతోంది. ఫిబ్రవరి 4,5 తేదీల్లో మెహందీ, హల్దీ ఫంక్షన్లు జరగ్గా.. ఫిబ్రవరి 6 (సోమవారం) వీరి వివాహం జరగనుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. పెళ్లి అనంతరం ఢిల్లీ, ముంబైలలో వివాహ రిసెప్షన్లను గ్రాండ్గా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
Next Story