Mon Dec 23 2024 13:47:08 GMT+0000 (Coordinated Universal Time)
కిచ్చ సుదీప్ కు 'ఈగ' కథ చెప్పడానికి రాజమౌళి ఎంత టైమ్ తీసుకున్నారో తెలుసా..?
కిచ్చ సుదీప్ కు 'ఈగ' కథ చెప్పడానికి రాజమౌళి ఎంత టైమ్ తీసుకున్నారో తెలుసా..?
ఈగ.. టాలీవుడ్ లో వచ్చిన టెక్నికల్ గా అతి గొప్ప సినిమా ఇది. తక్కువ బడ్జెట్ తో దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా చేయాలని అనుకున్నా కూడా గ్రాఫిక్స్ కోసం చాలానే కష్టపడ్డారు. భారీతనంతో సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ లీడ్ రోల్ చేశారు. ఈగ-సుదీప్ మధ్య సాగే సీన్స్ ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తాయి.
2012 లో వచ్చిన సినిమాలో.. ఉమెన్లైజర్ పాత్రను పోషించాడు కిచ్చా సుదీప్. ఈ చిత్రం మంచి కమర్షియల్ సక్సెస్ ను సాధించింది. విమర్శకులు కూడా సినిమా స్క్రీన్ ప్లేని ప్రశంసించారు. రాజమౌళితో కలిసి పనిచేయడం గురించి సుదీప్ తాజాగా చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేయడానికి తాను వెనుకాడలేదని చెప్పారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించిన ఫాంటసీ రివెంజ్ డ్రామా ఈగ. "రాజమౌళి సర్ని కలీసాను. ఆయన 10 సెకన్లలోపు కథని వివరించారు. నేను ఒప్పేసుకున్నాను. ఆ పాత్ర నెగెటివ్‌గా ఉందని పట్టించుకోకుండా.. ఆ సమయంలో ఆ పాత్రను చేయడానికి అంగీకరించాను" అని ఆయన చెప్పారు.
రామ్ గోపాల్ వర్మ కారణంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించానని కూడా సుదీప్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవాలనుకున్నానని.. రామ్ గోపాల్ వర్మ తీసిన రన్ లో అందుకే పని చేశానని అన్నారు. "రన్ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు, నాకు అమితాబ్ బచ్చన్‌తో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. సినీ దిగ్గజాలతో కలిసి పనిచేయాలని అనుకున్నాను. నేను ఎప్పుడూ ఉత్సాహంగా పని చేస్తాను. ప్రస్తుతం నేను కలిగి ఉన్న దానితో నేను సంతోషంగా ఉన్నాను" అని సుదీప్ అన్నారు. సుదీప్ నటించిన విక్రాంత్ రోనా మాంచి కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఉంది.
Next Story