Sun Dec 22 2024 23:42:04 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. టీటీడీ అధికారులు షారుఖ్ ఖాన్కు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. షారుఖ్ ఖాన్ ను చూడడానికి తిరుమలలో అభిమానులు ఎగబడ్డారు.
షారుఖ్, నయనతార జంటగా నటించిన ‘జవాన్’ చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గతనెల 31న విడుదలై ఈ సినమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ తండ్రి కొడుకు రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకోన్, విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్య మల్హోత్రా, యోగిబాబు, రిధి డోగ్రా కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
Next Story