Tue Dec 24 2024 00:24:01 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ దర్శకుడిని బలి తీసుకున్న కరోనా
ప్రదీప్ రాజ్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలగా.. కుటుంబ సభ్యులు బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అప్పట్నుంచి చికిత్స
కరోనా మరో దర్శకుడిని బలితీసుకుంది. ఇటీవలే కరోనా బారినపడిన దర్శకుడు ప్రదీప్ రాజ్(46) గురువారం రాత్రి కన్నుమూశారు. ప్రదీప్ మృతితో.. కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. కొద్దిరోజుల క్రితం ప్రదీప్ రాజ్ కు కోవిడ్ పాజిటివ్ అని తేలగా.. కుటుంబ సభ్యులు బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అప్పట్నుంచి చికిత్స పొందుతున్న ఆయన గురువారం మరణించినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
కోవిడ్ తో పాటు ఆయనకు మధుమేహం కూడా ఉందని, 15 ఏళ్లుగా దానితో బాధపడుతున్నారని తెలిపారు. కోవిడ్, మధుమేహం వల్ల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించి, చికిత్సకు సహకరించలేదని తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. ప్రదీప్ రాజ్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేజీఎఫ్ హీరో యష్ తో కలిసి 'కిచ్చా', 'కిరాతక' అనే సూపర్ హిట్ సినిమాలను తెరక్కించారు. ఈ చిత్రాలు యష్ కి స్టార్ హీరో స్టేటస్ తెచ్చిపెట్టాయి. అలాగే గోల్డెన్ స్టార్ మిస్టర్, రజనీకాంత, సతీష్ నీనాసం, అంజాద్ మాలే సినిమాలను కూడా ప్రదీప్ తెరకెక్కించారు. ప్రదీప్ రాజ్ మృతి పట్ల పలువురు దర్శకులు, నటీనటులు, సినీ అభిమానులు సంతాపం తెలిపారు.
Next Story