Tue Dec 24 2024 02:34:38 GMT+0000 (Coordinated Universal Time)
కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' ఓటీటీ లోకి వచ్చేస్తోంది
రూల్స్ రంజన్.. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్
రూల్స్ రంజన్.. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 6న విడుదలైంది. ఈ చిత్రానికి రథినం కృష్ణ దర్శకత్వం వహించాడు. స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మీటర్, వినరో భాగ్యము విష్ణు కథ తర్వాత 2023లో కిరణ్ అబ్బవరం నుండి వచ్చిన మూడవ సినిమా. ఈ చిత్రానికి థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది. దాదాపు ఎనిమిది వారాల థియేట్రికల్ రన్ తర్వాత, రూల్స్ రంజన్ OTTలో అడుగుపెట్టింది. ఆహా ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది. తాజాగా డిజిటల్ ప్రీమియర్ తేదీని ధృవీకరించింది.
ప్రముఖ తెలుగు ఓటీటీ వేదికగా ఆహాలో నవంబరు 30 సాయంత్రం 6 గంటల నుంచి ‘రూల్స్ రంజన్’ను స్ట్రీమింగ్ చేయనున్నారు. “Rules Ranjann is coming to rewrite the rules book! #RulesRanjann Premieres November 30 at 6 pm,” అంటూ ఆహా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్టు పెట్టింది. ఈ సినిమాలో మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్ నటించారు. థియేటర్లలో సినిమాను మిస్ అయిన వాళ్లు ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు.
Next Story