Wed Dec 25 2024 01:24:04 GMT+0000 (Coordinated Universal Time)
నెట్ ఫ్లిక్స్ లో మీటర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
సెబాస్టియన్ తర్వాత ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం మరోసారి పోలీస్ గా కనిపిస్తాడు. పోలీస్ కానిస్టేబుల్ గా తన తండ్రికి ఎదురవుతూ..
ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వినరో భాగ్యము విష్ణుకథ కాస్త ఫర్వాలేదనిపించుకుంది. దాని తర్వాత రమేశ్ దర్శకత్వంలో మీటర్ తో వచ్చాడు. ఏప్రిల్ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. చిరంజీవి- హేమలత నిర్మించిన ఈ సినిమాకి సాయికార్తీక్ సంగీతం అందించాడు.
సెబాస్టియన్ తర్వాత ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం మరోసారి పోలీస్ గా కనిపిస్తాడు. పోలీస్ కానిస్టేబుల్ గా తన తండ్రికి ఎదురవుతూ వచ్చిన అవమానాలను చూస్తూ పెరిగిన హీరో, ఆ జాబు మాత్రం చేయకూడదని నిర్ణయించుకుంటాడు. కాలం కలిసొచ్చి ఆ జాబ్ వస్తే కూడా మానేయాలని అనుకుంటాడు. అలాంటి అతను పోలీస్ జాబ్ లోనే ఉండిపోవాలనిపించేలా జరిగిన సంఘటన ఏంటనేదే సినిమా. ఈ సినిమా త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. మే 5 నుండి మీటర్ మూవీ స్ట్రీమ్ చేయనున్నట్లు తెలిపింది. థియేటర్లో ప్రేక్షకాదరణ పొందలేని మీటర్.. ఓటీటీలో ఏ స్థాయిలో ఆదరణ పొందుతుందో చూడాలి.
Next Story