టాలీవుడ్ ని వదిలేసిందా?
చాలా తక్కువ కాలంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది కియరా అద్వానీ. తెలుగులో తన మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే [more]
చాలా తక్కువ కాలంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది కియరా అద్వానీ. తెలుగులో తన మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే [more]
చాలా తక్కువ కాలంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది కియరా అద్వానీ. తెలుగులో తన మొదటి సినిమాతోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తరువాత ఆమెకు చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ ఏమి ఒప్పుకోవడంలేదు. హిందీ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో క్షణం ఖాళీ లేకుండా బిజీ గా గడుపుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం హిందీ లో ఓ ఐదు భారీ చిత్రాల్లో నటించేస్తోంది.
గుడ్ న్యూస్ లోనూ….
లక్ష్మి బాంబ్- గుడ్ న్యూస్- ఇందూ కి జవానీ- షేర్ షా-భూల్ బులయా 2 చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది అద్వానీ. అక్షయ్ కుమార్ హీరో గా నటిస్తున్న ‘లక్ష్మీ బాంబ్’ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆమె రాయ్ లక్ష్మీ పోషించిన పాత్రను పోషిస్తోంది. అలానే కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘గుడ్ న్యూస్’ లోనూ అక్షయ్ – దిల్జీత్ లాంటి స్టార్లతో కలిసి నటిస్తోంది. విష్ణు వర్ధన్ దర్శకత్వం ‘షేర్ షాలో’ నూ కియరా కీలక పాత్ర పోషిస్తోంది. అలానే యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ‘భూల్ బులయా 2 ‘ లో ఈమె నటిస్తుంది. ఇదొక హారర్ కామెడీ చిత్రం. ఆదిత్య సీల్ అనే కుర్ర హీరో సరసన ఇందూకి జవానీ చిత్రంలో ఆడిపాడుతోంది. ఇలా వరస సినిమాలతో ఫుల్ బిజీ అయినా కియారా ఇక్కడ ఖాళీ ఉంటే అప్పుడు టాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిద్దాం అంటుంది.