Mon Dec 23 2024 20:13:06 GMT+0000 (Coordinated Universal Time)
నందమూరి వారి పెళ్ళిలో కొడాలి నాని.. పిక్ వైరల్!
ఇటీవల టీడీపీ నాయకులు.. కొడాలినానికి నందమూరి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా..
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన రాజకీయ విమర్శలతో ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా కొడాలి నానికి నందమూరి కుటుంబంతో మంచి అనుబంధం ఉందని చెబుతుంటారు. నందమూరి హరికృష్ణకి కొడాలి నాని ఎంతో సన్నిహితంగా ఉండేవారని, జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నానిని అన్నయ్యగా భావిస్తాడని కొందరు చెబుతుంటారు. అయితే ఇటీవల ఈ మాటలు అన్నిటిని కొందరు టీడీపీ నాయకులు కొట్టిపడేశారు.
అసలు నానికి నందమూరి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, అవన్నీ ఒట్టి మాటలు మాత్రమే అని ఒక బహిరంగ సభలోనే టీడీపీ నాయకులు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఒక పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కోడలి నాని, నందమూరి కుటుంబసభ్యులు సన్నిహితంగా కనిపిస్తున్నారు. ఇటీవల హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కుమారుడు పెళ్లి అయిన సంగతి తెలిసిందే. ఆ పెళ్ళిలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు మరియు ఇతర నందమూరి కుటుంబసభ్యులు కూడా హాజరయ్యి సందడి చేశారు.
ఆ పెళ్లి సంబరానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే తాజాగా కొడాలి నానికి సంబంధించిన ఒక ఫోటో బయటకి వచ్చింది. ఆ ఫోటోలో నందమూరి సుహాసిని దంపతులు దగ్గరుండి.. కొడాలి నానితో నూతన దంపతుల పై అక్షింతలు వేయించి ఆశీర్వాదం అందజేయిస్తున్నారు. ఇక ఈ ఫోటోని కొడాలి నాని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇది నందమూరి కుటుంబంతో కొడాలి నానికి ఉన్న సంబంధం అంటూ పోస్టులు పెడుతున్నారు.
కాగా కొడాలి నాని.. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. వి వి వినాయక్ దర్శకత్వంలో తారక్ నటించిన అదుర్స్, సాంబ చిత్రాలకు కోడలి నానినే నిర్మాతగా చేశారు. అలాగే ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా ఫంక్షన్ అయితే కృష్ణ జిల్లా పామరులో ఓ రేంజ్ లో నిర్వహించారు కొడాలి నాని.
Next Story