Thu Dec 19 2024 15:01:05 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : పవన్, చంద్రబాబుపై కొడాలి కామెంట్స్.. బక్కెట్ గాళ్ళంతా..
యువగళం-నవశకం సభలో చంద్రబాబు, పవన్ చేసిన కామెంట్స్ పై కొడాలి నాని రియాక్షన్.
Kodali Nani : ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఏపీ పొలిటికల్ లీడర్స్ తమ కార్యాచరణలో వేగం పెంచారు. ఇక అలియన్స్ తో ముందుకు వెళ్తున్న టీడీపీ, జనసేన.. బలం పెంచుకునేలా ముందుకు కదులుతున్నారు. ఈక్రమంలోనే నిన్న విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద 'నవశకం' అంటూ ప్రజా సభ ఏర్పాటు చేశారు.
నారా లోకేశ్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్రకు ముగింపు పలుకుతూ.. విజయోత్సవ సభని నిర్వహించారు. ఈ సభలో నారా లోకేశ్, టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సభలో వైఎస్సార్సీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈ సభ గురించి వైఎస్సార్సీపీ నాయకుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు.
కొడాలి నాని మాట్లాడుతూ..
"చంద్రబాబు, పవన్, లోకేశ్ అడుగు ఉడిపోయిన బక్కెట్ లాంటి వాళ్ళు. ప్రస్తుతం వాళ్ళు చేసేదంతా పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నమే. వాళ్లంతా ఇప్పుడు గంటల మోగిస్తూ యుద్ధభేరి మొదలుపెడుతున్నారు. కానీ జగన్ 2009 సెప్టెంబర్ 2నే యుద్ధం మొదలుపెట్టారు. 12 ఏళ్ల క్రితమే యుద్ధభేరి మోగించిన జగన్.. సోనియాని కూకటి వేళ్లతో పెకలించారు. చంద్రబాబుని భూస్థాపితం చేశారు. అలాగే పవన్ ని రెండు చోట్ల చిత్తు చేయడం, లోకేష్ ని మంగళగిరిలో సమాధి కట్టారు. ఈ జైత్రయాత్ర పరంపరని ఎవరు ఆపలేరు.
ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఏంటని..? చంద్రబాబు ఇప్పుడు విచిత్రంగా మాట్లాడుతున్నారు. 30 ఏళ్ళ క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రగిరి నుంచి కుప్పం ట్రాన్స్ఫర్ అయిన విషయం మర్చిపోయారా. అలాగే లోకేశ్ పుట్టిన ఊరు మంగళగిరా..? పవన్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకుంటూ పెరిగారా..?" అంటూ ప్రశ్నించారు. ఈ ముగ్గురు వలస వెళ్లిన వాళ్లే అని, వీళ్ళ యుద్ధభేరితో జగన్ చిటికెన వేలిని కూడా కదిలించలేరని పేర్కొన్నారు.
Next Story