Mon Dec 23 2024 08:06:10 GMT+0000 (Coordinated Universal Time)
Yatra 2 : యాత్ర 2లో ఈ పాత్ర 'కొడాలి నాని'నా..
యాత్ర 2 టీజర్ లో కనిపించిన ఆ పాత్ర 'కొడాలి నాని' అంటా. అది మీరు గమనించారా..?
Yatra 2 : మహి వి రాఘవ్ దర్శకత్వంలో 2019లో వచ్చిన 'యాత్ర' మంచి విజయాన్ని అందుకుంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కిన ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఇక ఈ సీక్వెల్ ని వైఎస్ జగన్ లైఫ్ స్టోరీ బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఆయన సీఎం ఎలా అయ్యారు అనే విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
కాగా నేడు ఈ మూవీ నుంచి ఓ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ టీజర్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ పాత్రలతో పాటు వైఎస్ విజయమ్మ, భారతి, సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, రోశయ్య పాత్రలని చూపించారు. అలాగే టీజర్ చివరిలో ఓ పాత్రని చూపించారు. ఆ పాత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడుతూ కనిపిస్తుంది. టీజర్ లో ఆ పాత్రని చూసిన కొందరు.. అది గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాత్ర అని చెబుతున్నారు. ఆ లుక్ చూడడానికి కొడాలి నాని లాగానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఆ పాత్ర నిజంగా కొడాలి నానిదేనా అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ప్రస్తుతం అయితే ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాని త్రీ ఆటమ్ లీవ్స్, V సెల్యులాయిడ్స్ బ్యానర్ కలిసినిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టీజర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Next Story