Tue Dec 24 2024 01:15:09 GMT+0000 (Coordinated Universal Time)
భర్త కాదు.. మాజీ భర్త.. హోస్ట్ కు క్లారిటీ ఇచ్చిన సమంత
భర్త కాదు.. మాజీ భర్త.. హోస్ట్ కు క్లారిటీ ఇచ్చిన సమంత
నటి సమంతకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటనకు, ఊ అంటావా మామ పాటతో వచ్చిన క్రేజ్ కారణంగా బాలీవుడ్ నుండి కూడా మాంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. ఆమె కరణ్ జొహార్ షో 'కాఫీ విత్ కరణ్'లో కూడా పాల్గొనింది. అక్షయ్ కుమార్ తో కలిసి ఆమె ఈ షోలో పాల్గొంది. ఈ షోలో సమంత పెళ్లి, విడాకుల గురించి కరణ్ ప్రస్తావించాడు. మాటల మధ్యలో చైతూని భర్తగా కరణ్ సంబోధించగా... ఆయన భర్త కాదు, మాజీ భర్త అని సమంత చెప్పింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందని కరణ్ అడిగితే... ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే, ఆ గదిలో కత్తులు వంటి వాటిని దాచేయాలని చెప్పింది. ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు లేవని తెలిపింది. భవిష్యత్తులో ఫ్రెండ్లీగా ఉండొచ్చేమో చెప్పలేమని వ్యాఖ్యానించింది. విడాకుల తర్వాత తాను 250 కోట్ల భరణం తీసుకున్నానని ప్రచారం చేశారని, అది నిజం కాదని స్పష్టం చేసింది.
చైతూ నుండి విడిపోయిన తర్వాత సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి సమంతను KJo అడిగినప్పుడు, ఆమె మాట్లాడుతూ " నేను నిజంగా దాని గురించి ఫిర్యాదు చేయలేను.. ఎందుకంటే నేను ఆ మార్గాన్ని ఎంచుకున్నాను.. విడిపోయినప్పుడు చాలా కలత చెందాను. దాని గురించి బయటకు వచ్చేందుకు చాలానే కష్టపడ్డాను.. ఇప్పుడు బాగానే ఉంది. నేను గతంలో కంటే బలంగా ఉన్నాను." అని చెప్పుకొచ్చింది. సమంత రూత్ ప్రభు విడాకులకు సంబంధించిన సంభాషణలు షోలో ప్రధానమైన అంశంగా కనిపించాయి. 'మా విడాకులు అంత సామరస్యంగా జరగలేదు. విడాకులు తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. విడాకులు తీసుకున్న కొత్తలో బాధపడ్డాను. జీవితం చాలా కఠినంగా అనిపించింది.' అని మరింత వివరంగా చెప్పింది సమంత.
Next Story