Mon Dec 23 2024 13:53:00 GMT+0000 (Coordinated Universal Time)
తన విడాకులపై అక్కడ ఓపెన్ అవ్వనున్న సమంత
మాజీ భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడానికి గల కారణాల గురించి
ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించే 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి ఇప్పటి దాకా అనేకమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. తాజాగా, 'కాఫీ విత్ కరణ్' ఏడో సీజన్ ప్రారంభం కానుంది. కొత్త సీజన్ తొలి ఎపిసోడ్ జులై 7న డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ప్రారంభ ఎపిసోడ్ కు సారా అలీ ఖాన్, జాన్వి కపూర్ హాజరుకానున్నారు. ఈ షోకి దక్షిణాది ముద్దుగుమ్మ సమంత కూడా హాజరుకానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి 'కాఫీ విత్ కరణ్' లో సందడి చేయనుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ సీజన్లో సమంత రూత్ ప్రభు కూడా తొలి సారి ఈ షోలో అడుగుపెట్టనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అక్షయ్ కుమార్తో పాటు సమంత కూడా హాజరు అవ్వనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ షోలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనే వివరాలు మాత్రం షేర్ చేయలేదు. సారా-జాన్వీ, సమంతా-అక్షయ్లతో పాటు, వరుణ్ ధావన్ అనిల్ కపూర్తో కలిసి షోలో కనిపించనున్నారు. అలియా భట్ కూడా రణవీర్ సింగ్తో కలిసి కనిపించనుంది. కరణ్ జోహార్ తీస్తున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో అలియా, రణవీర్ కలిసి నటించనున్నారు.
మాజీ భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడానికి గల కారణాల గురించి సమంత షోలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలకు దారితీసింది. సోషల్ మీడియా పుకార్ల ప్రకారం, 'ఏ మాయ చేసావే' స్టార్ నాగ చైతన్యతో విడాకుల గురించి సమంత ఇప్పుడు మొదటిసారి షోలో మాట్లాడబోతోంది. 'కాఫీ విత్ కరణ్'లో ఒక ప్రశ్నకు సమాధానం విషయంలో సమంత కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ భాగం ఫైనల్ కట్లోకి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
News Summary - Koffee With Karan 7 Samantha To Appear With Akshay kumar
Next Story