దొంగ తో మళ్లీ కొట్టాడండి
కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమా ఫ్లేవర్ ని ఇంకా మర్చిపోకుండానే దొంగ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కోలీవుడ్ హీరో కార్తీ. ఖైదీ సినిమాతో నటనలో [more]
కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమా ఫ్లేవర్ ని ఇంకా మర్చిపోకుండానే దొంగ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కోలీవుడ్ హీరో కార్తీ. ఖైదీ సినిమాతో నటనలో [more]
కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమా ఫ్లేవర్ ని ఇంకా మర్చిపోకుండానే దొంగ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కోలీవుడ్ హీరో కార్తీ. ఖైదీ సినిమాతో నటనలో 1000 మెట్లెక్కిన కార్తీ… ఆ సినిమాతో మాస్, క్లాస్, ప్రేక్షకులను పడేసాడు. ఖైదీ సినిమాలో కార్తీ నటనకు కోలీవుడ్ ప్రేక్షకులే కాదు, టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఆ సినిమాతో కార్తీ నుండి సినిమా వస్తుంది అనగానే అందరిలో పిచ్చ ఆసక్తి. దానికి తగ్గట్టుగానే వదిన జ్యోతిక తో కలిసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ దొంగ అంటూ వచ్చెయ్యడం.. ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చెయ్యడం జరిగిపోయింది. కొందరు హీరోలు కథలు లేక అల్లాడిపోతుంటే.. కార్తి మాత్రం మంచి కథలను వెతికి పట్టుకుంటున్నాడు అనిపిస్తుంది.. ఖైదీ, దొంగ సినిమాలు చూస్తుంటే.
జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో తెరకెక్కిన దొంగ నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. జీతూ జోసెఫ్ చిన్న లైన్ తీసుకుని దానికి పట్టుసడలని స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. తెలిసిన కథే అయినా.. కథనం బాగుండటంతో నెక్ట్స్ ఏంటి అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా కామెడీగా సాగింది. అక్కడక్కడా కాస్త స్లో అనే ఫీలింగ్ కలిగినంతలోనే…. కార్తీ కామెడీతో సినిమాని లేపాడు. ఓ చిన్నపిల్లాడికి కార్తితో వచ్చే కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. సత్యరాజ్, కార్తి మధ్య సన్నివేశాలు కూడా ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. అయితే ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డల్ అయింది.. కానీ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది.
జ్యోతిక పాత్ర మొదటి సగంలో అసలు ప్రాధాన్యం లేకుండా సాగగా సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సన్నివేశాలకే పరిమితం అయ్యారు. ఫస్ట్ హాఫ్ స్లోగా మొదలవడం.. సెకండ్ హాఫ్ లో కామెడీ లేకపోవడం, జ్యోతిక కేరెక్టర్ కి ఫస్ట్ హాఫ్ లో పెద్దగా స్కోప్ లేకపోవడం, హీరోయిన్ సీన్స్ కూడా పెద్దగా లేకపోవడం అనే చిన్న చిన్న మైనస్ లు తప్పిదే కార్తీ దొంగ ఓవరాల్ గా ఆకట్టుకునే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.