Mon Dec 23 2024 13:23:43 GMT+0000 (Coordinated Universal Time)
ఆ నలుగురి పై తమిళ నిర్మాత మండలి నిషేధం..!
తమిళ చిత్ర నిర్మాతల మండలి కోలీవుడ్ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చింది. విశాల్, ధనుష్, శింబు, అథర్వ పై నిషేధం విధిస్తూ..
తమిళ చిత్ర నిర్మాతల మండలి కోలీవుడ్ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చింది. విశాల్, ధనుష్, శింబు, అథర్వ పై నిషేధం విధిస్తూ తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇక పై ఈ నలుగురు హీరోలు ఏ సినిమాలోనూ నటించకూడదని ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రెడ్ కార్డ్ జారీ చేసిందని సమాచారం. ఈ నిర్ణయం ప్రస్తుతం తమిళనాడులో సంచనలనంగా మారింది. ఇంతకీ అసలు ఏమైంది..? ఈ నలుగురు హీరోలపై ఎందుకు ఈ బ్యాన్..?
ముందుగా విశాల్ గురించి మాట్లాడుకుంటే.. ఈ హీరో ప్రొడ్యూసర్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అసోసియేషన్‌కి సంబంధించిన నిధులను విశాల్ దుర్వినియోగం చేశాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణల దృష్ట్యా విశాల్ పై నిర్మాత మండలి రెడ్ కార్డు జారీ చేసింది. ఇక శింబు విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత మైఖేల్ రాయప్పన్, ఈ హీరో మధ్య గత కొంతకాలంగా ఒక వివాదం నడుస్తుంది. ఈ విషయం గురించి శింబుని పలుసార్లు చర్చలకు పిలిచినా, తాను సరిగ్గా రియాక్ట్ అవ్వకపోవడంతో నిర్మాత మండలి ఇలాంటి సీరియస్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.
ఇక ధనుష్ ఏమో తెనందాల్ నిర్మాణ సంస్థలో ఒక సినిమాకి సైన్ చేశాడు. మూవీ 80 శాతం షూటింగ్ కూడా పూర్తి చేశాడు. అయితే ఆ తరువాత నుంచి నిర్మాతను ఇబ్బందులకు గురి చేశాడని, దాని వల్ల ప్రొడ్యూసర్ కి నష్టం కలగడంతో అసోసియేషన్ పిర్యాదు చేసినట్లు సమాచారం. అథర్వ పరిస్థితి కూడా అంతే.. మదియలకన్ నిర్మాణ సంస్థతో మూవీ ఓకే చేయడం, కానీ ఆ నిర్మాతలతో సహకరించకపోవడంతో నిర్మాత మండలి వరకు చేరుకుంది.
వీరితో పాటు కోలీవుడ్ లోని మరికొందరు నటీనటులు పై కూడా నిషేధం పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇండస్ట్రీలోని ధనుష్, విశాల్, శింబు వంటి స్టార్స్ కి రెడ్ కార్డు జారీ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం పై ఈ హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Next Story