ఓవర్ చేస్తున్న కోలీవుడ్..!
'బాహుబలి' సినిమాతో ఇండియా వైడ్ అందరూ తన వైపు తిప్పుకునేలా చేసాడు రాజమౌళి. 'బాహుబలి' కొల్లగొట్టిన కలెక్షన్స్ తో అన్ని వుడ్స్ తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నారు. కోలీవుడ్ లో జనాలైతే ఈ సినిమా ఎంజాయ్ చేస్తూనే అసూయ చెందారు. అక్కడ బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ఈ సినిమాకు బాగా వచ్చాయి. దీంతో అక్కడి డైరెక్టర్స్ కి ఈ సినిమా సవాలుగా మారింది. అక్కడ శంకర్ ఒక్కడే జాతీయ స్థాయిలో సినిమాను తీయగలడు. అందుకే కోలీవుడ్ జనల కళ్లు ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ మీద పడింది.
అడ్వాన్స్ బుకింగ్స్ తో 120 కోట్లా...
ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎక్కడాలేని హైప్ తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాట ఈ సినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మరీ అతిగా అనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఈ సినిమాకు రూ.120 కోట్లు వచ్చాయని అక్కడి క్రిటిక్ రమేష్ బాల ఒక ట్వీట్ చేశాడు. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదు. తమిళనాడులో థియేటర్స్ కౌంట్ మన ఆంధ్రాలో ఉన్న థియేటర్స్ తో పోలిస్తే సగం కూడా లేవు.
పబ్లిసిటీ స్టంటేనా..?
'సర్కార్' సినిమా తమిళంలో కన్న తెలుగులోనే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిందంటేనే అర్ధం చేసికోవచ్చు. ఎంత భారీ సినిమా అయినా 700 థియేటర్స్ కి మించి చేయరు. అలాంటిది ఈసినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇంత ఎలా వచ్చిందంటే ఎవరికి అర్ధం కానీ విషయం. మరీ నిజంగా అంత బుకింగ్స్ జరిగాయా..? అంటే కాదు అనే చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు.