Tue Dec 24 2024 01:49:56 GMT+0000 (Coordinated Universal Time)
స్టార్ కమెడియన్ వడివేలుకు మాతృవియోగం
సరోజినీ మధురైకి సమీపంలోని విరగానూర్ గ్రామంలో నివసిస్తున్నారు. అనారోగ్యం కారణంగా.. కొద్దిరోజులుగా మధురైలోని..
ఇండస్ట్రీలో కొద్దిరోజులుగా వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెల.. ప్రముఖ నటులు కన్నుమూయగా.. ఈనెలలో ప్రముఖులకు సంబంధించిన తల్లిదండ్రులు తనువు చాలిస్తున్నారు. నిన్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచె కు పితృవియోగం కలుగగా.. తాజాగా కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలుకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సరోజినీ వయో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు.
సరోజినీ మధురైకి సమీపంలోని విరగానూర్ గ్రామంలో నివసిస్తున్నారు. అనారోగ్యం కారణంగా.. కొద్దిరోజులుగా మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. గత రాత్రి చికిత్స పొందుతూనే ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి.. వడివేలు షూటింగ్ ను మధ్యలోనే ఆపి సొంతఊరికి పయనమయ్యారు. వడివేలు తల్లి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. కాగా.. వడివేలు తెలుగులో చంద్రముఖి సినిమాతో పేరు తెచ్చుకున్నాడు.
Next Story