Mon Dec 23 2024 20:18:12 GMT+0000 (Coordinated Universal Time)
RRRలో ఆ పాట పాడింది ఈ చిన్నారే.. వీడియో చూడండి !
తాజాగా.. ఆ పాటపాడిన చిన్నారి పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. "కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా" పాట పాడింది ఈ చిన్నారే అంటూ..
హైదరాబాద్ : RRRసినిమాలో "కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా" పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటతోనే అసలు కథ మొదలవుతుంది. గోండు జాతికి చెందిన మల్లి అనే పిల్ల ఈ పాటపాడుతూ బ్రిటీష్ వాళ్ల చేతులపై అందమైన డిజైన్లు వేస్తుంటుంది. దాంతో తెల్లదొరసాని మల్లిని తనతోపాటు ఢిల్లీకి తీసుకుపోతుంది. మల్లి కోసం రంగంలోకి దిగుతాడు భీమ్(ఎన్టీఆర్). "కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా" పాట పాడింది ఎవరు ? గొంతు ఎంత బావుందో అని ఖచ్చితంగా అందరూ అనుకునే ఉంటారు.
తాజాగా.. ఆ పాటపాడిన చిన్నారి పేరు టాలీవుడ్ లో మారుమోగిపోతోంది. "కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా" పాట పాడింది ఈ చిన్నారే అంటూ.. సంగీత దర్శకుడు కీరవాణి ప్రకృతి రెడ్డి అనే పాపను పరిచయం చేశారు. ప్రకృతి చాలా టాలెండెట్ అమ్మాయి అని, త్వరలోనే పాట ఒరిజినల్ ట్రాక్ ను విడుదల చేస్తామని, అప్పుడు పూర్తి పాటను విని ఆస్వాదించవచ్చని కీరవాణి తెలిపారు. 2019లో ప్రసాద్ ల్యాబ్స్ లో రికార్డు చేసిన "కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా" మేకింగ్ వీడియోను ప్రకృతి షేర్ చేసింది. RRRలో ఈ ఈ అద్భుతమైన పాటను పాడే అవకాశం ఇచ్చిన కీరవాణి సార్‌కి చాలా ధన్యవాదాలు అని తెలిపింది.
Next Story