Sun Dec 22 2024 22:19:59 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్జీవీ "కొండా" ట్రైలర్ విడుదల
ఇటీవలే తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఎవరూ తీయని సినిమాలు తీస్తూ.. నిత్యం ఏదోక విషయంపై కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయాల్లో చాలామంది బయోపిక్ లను ఒక్కొక్కటిగా.. తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
Also Read : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన యువరాజ్ దంపతులు
ట్రైలర్ చూస్తే.. కొండా మురళి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు? సురేఖతో ప్రేమ? సురేఖ కొండా మురళికి ఎలా సపోర్ట్ చేసింది? కొండా మురళి మీద జరిగిన హత్యాయత్నం, నక్సలైట్ల నేపథ్యం ఇలా అన్ని అంశాలను సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. కొండా ట్రైలర్ లో ఆర్జీవీ మార్క్ కనపడింది. చివరగా నా పేరు కొండా మురళి అంటూ ఈ ట్రైలర్ ని ముగించాడు. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.
Next Story