Mon Dec 23 2024 10:36:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆచార్య విడుదల అప్పుడే.. ప్రకటించిన చిత్ర యూనిట్ !
ఆచార్య చిత్రయూనిట్ కూడా రిలీజ్ డేట్ వెల్లడించింది. ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది కాబట్టి.. ఆచార్యను
కరోనా కారణంగా సంక్రాంతికి ముందు, తర్వాత రావాల్సిన పెద్ద సినిమాల రిలీజ్ లు వరుసగా వాయిదా పడ్డాయి. దాంతో బడా హీరోల ఫ్యాన్స్ అంతా నిరాశకు గురయ్యారు. ఫిబ్రవరిలో రావాల్సిన ఆచార్య విడుదల కూడా వాయిదా పడటంతో.. ఇక ఇప్పుడప్పుడే పెద్ద సినిమాలు వచ్చే అవకాశమే లేదనుకున్నారంతా. కానీ.. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో.. వివిధ రాష్ట్రాల్లో మూతపడిన థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరచుకుంటున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నాటికి వైరస్ తగ్గుముఖం పడుతుందన్న సంకేతాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాలు సహా.. అగ్రహీరోల సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.
ఈసారి రిలీజ్ పక్కా ఫిక్స్ అంటూ.. ఆర్ఆర్ఆర్ యూనిట్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మార్చి 25వ తేదీన ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. దాంతో ఆచార్య చిత్రయూనిట్ కూడా రిలీజ్ డేట్ వెల్లడించింది. ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది కాబట్టి.. ఆచార్యను ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణంలో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా.. మొత్తానికి విడుదల కాబోతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు.
News Summary - Konidela Production Company Officially Announced Acharya Movie Release Date
Next Story