Mon Dec 23 2024 10:22:52 GMT+0000 (Coordinated Universal Time)
#NTR30 : గ్రాండ్ గా ఎన్టీఆర్ 30వ సినిమా లాంచ్
తాజాగా.. #NTR30 సినిమా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఎన్టీఆర్ నటిస్తోన్న 30వ సినిమా ఇది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ప్రకటించి చాలాకాలం అవుతుంది. అయితే ఇంతవరకూ ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా.. #NTR30 సినిమా హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఎన్టీఆర్ నటిస్తోన్న 30వ సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు ప్రకటిస్తూ.. చిత్రయూనిట్ ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది.
జాన్వీ కపూర్ కు తెలుగులో ఇదే మొదటి సినిమా. సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించిన #NTR30 పూజా కార్యక్రమానికి జాన్వీకపూర్ కూడా హాజరైంది. ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ 31వ సినిమాకి దర్శకత్వం వహించనున్న ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, దిల్ రాజ్, సితార నాగవంశీ, శ్రీకాంత్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యువ సుధా ఆర్ట్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నాడు. #NTR30లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
Next Story