కమెడియన్స్ కళ్ళలో నీళ్లు!!
పాతతరం సినిమాల్లో బాబు మోహన్ కామెడీ, కోట గారి విలనిజం ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకో.. లేదంటే వాళ్లే కావాలని దూరమయ్యారో [more]
పాతతరం సినిమాల్లో బాబు మోహన్ కామెడీ, కోట గారి విలనిజం ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకో.. లేదంటే వాళ్లే కావాలని దూరమయ్యారో [more]
పాతతరం సినిమాల్లో బాబు మోహన్ కామెడీ, కోట గారి విలనిజం ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకో.. లేదంటే వాళ్లే కావాలని దూరమయ్యారో అలీతో సరదాగా షో లో వివరణ ఇచ్చారు. కోట శ్రీనివాస్ రావు అంటే విలనిజమేకాదు.. మంచి కామెడీ కూడా. బాబూమోహన్ విలన్ కన్నా కామెడియన్ గానే గుర్తింపు పొందాడు. మరి కోట – బాబు మోహన్ ల కలయికలో ఓ 60 నుండి 70 సినిమాలు తెరకెక్కి ఉంటాయి. వాళ్ళిద్దరి కాంబో కామెడీ, విలనిజం అన్ని ఆయా సినిమాలకే హైలెట్ అనేలా ఉండేవి. బాబు మోహన్ – కోట శ్రీనివాస్ రావు కాంబో సీన్స్ ఒక పక్క విలనిజాన్ని, మరోపక్క కామెడీ ట్రాక్ ని నడిపించేవి. తాజాగా అలీ తో జాలిగా షోకి వచ్చిన కోట శ్రీనివాస్ రావు – బాబు మోహన్ లు సినిమా విషయాలనే కాదు… పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు.
కోట గారికి వయసు రీత్యా అవకాశాలు తగ్గితే.. బాబు మోహన్ కి ఒక్కసారిగా సినిమాలు తగ్గడానికి పరోక్షంగా చంద్రబాబే కారణమంటున్నాడు. రాజకీయాల్లో ఎమ్యెల్యేగా ఉన్న టైం లో సినిమాలు చేసిన నేను.. మంత్రిని అయ్యాక కాబినెట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అని.. కానీ చంద్రబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు సినిమాలు పక్కనబెట్టమని చెప్పారని, కామెడీ చేసేవాడిని తీసుకొచ్చి మంత్రి పదవినిచ్చా అంటూ నన్ను కామెంట్స్ చేస్తున్నారని చంద్రబాబు చెప్పబట్టే సినిమాలకు గ్యాప్ ఇచ్చా అని.. కానీ అదే గ్యాప్ చాలా కాలం వరకు కొనసాగింది అని చెప్పాడు బాబు మోహన్. మేము ఇద్దరం సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవాళ్ళం.. కానీ మా జీవితాల్లో మేము మా నవ్వుని పోగొట్టుకున్నాం.. కోట గారికి, నాకు జీవితంలో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నేను కొడుకుని పోగొట్టుకున్నాను, ఆయన కొడుకుని కోల్పోయారు. ఇక బాబు మోహన్ కి మరొక కొడుకు ఉన్నాడు నాకు అదీ లేదు అంటూ.. మేము అందరిని నవ్వించినా.. ఎప్పుడూ ఏడుస్తూనే ఉన్నామంటూ కన్నీటి చుక్కలు రాల్చారు.