Tue Nov 05 2024 19:46:33 GMT+0000 (Coordinated Universal Time)
ఇండస్ట్రీని వెంటాడుతున్న వరుస విషాదాలు.. మరో సీనియర్ నటి మృతి
కేపీఏసీ లలిత.. తన సినీ కెరియర్ లో 550 సినిమాలకు పైగా నటించారు. ఉత్తమ సహాయ విభాగంలో రెండు జాతీయ అవార్డులు, నాలుగు రాష్ట్ర..
కేరళ : దక్షిణ భారత సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. లెజెండ్రీ నటులు, సింగర్లు, కమెడియన్లు ఇలా వయస్సులో చిన్నా - పెద్ద తేడా లేకుండా కన్నుమూస్తున్నారు. తాజాగా మలయాళ పరిశ్రమకు చెందిన సీనియర్ నటి కేపీఏసీ లలిత(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. మంగళవారం త్రిపుణితురలో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేపీఏసీ లలిత.. ఒకప్పుడు మళయాళ తెరపై ఓ వెలుగు వెలిగారు. మలయాళం కమర్షియల్ సినిమాల్లో ఆమె రాణించారు. లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ.
Also Read : ఇండస్ట్రీలో మరో విషాదం.. లేడీ కమెడియన్ హఠాన్మరణం
కేపీఏసీ లలిత.. తన సినీ కెరియర్ లో 550 సినిమాలకు పైగా నటించారు. ఉత్తమ సహాయ విభాగంలో రెండు జాతీయ అవార్డులు, నాలుగు రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. అనారోగ్యానికి గురికాక ముందు వరకూ కేరళ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా ఉన్నారు. కేపీఏసీ లలిత మృతి పట్ల సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆమె మృతిపై "రెస్ట్ ఇన్ పీస్ లలితా ఆంటీ! మీతో వెండితెరను పంచుకోవడం ఒక అదృష్టం! నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు. #KPACLalitha" అంటూ నెట్టింట్లో పోస్ట్ పెట్టారు. హీరోయిన్ కీర్తి సురేష్, మంజు వారియర్ లు కూడా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. సంతాపం తెలిపారు.
Next Story