Mon Dec 23 2024 07:10:52 GMT+0000 (Coordinated Universal Time)
Krish : రాడిసన్ డ్రగ్స్ కేసులో ముందస్తు బెయిల్ కోసం డైరెక్టర్ క్రిష్..
రాడిసన్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్. అసలు విచారణకు హాజరు కాకుండానే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన డైరెక్టర్ క్రిష్.
Krish Jagarlamudi : టాలీవుడ్ లో సెన్సేషన్ అయిన రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త సెలబ్రిటీ పేరు వచ్చి చేరుతుంది. ఇటీవల ఈ కేసులోకి దర్శకుడు క్రిష్ పేరు కూడా వచ్చి చేరిన విషయం అందరికి తెలిసిందే. పోలిసుల దర్యాప్తులో ఆ రోజు జరిగిన పార్టీలో క్రిష్ కూడా పాల్గొన్నారని తెలిసింది. దీంతో క్రిష్ విచారణకు హాజరుకావాలంటూ ఇటీవల గచ్చిబౌలి పోలీసులు ఆయనకి నోటీసులు పంపించారు.
అయితే క్రిష్ ఇప్పటివరకు విచారణకు హాజరుకాలేదు. తాను ఆరో పార్టీలో పాల్గొన్న విషయం నిజమే అని, కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని, ప్రస్తుతం అయితే తాను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నట్లు, అందుకే విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు క్రిష్ పోలీసులకు చెప్పుకొస్తున్నారట. ఇది ఇలా ఉంటే, అసలు విచారణకు హాజరు కాకుండానే క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసినట్లు సమాచారం.
ఇప్పటివరకు డ్రగ్స్ తీసుకోలేదని, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను అని చెప్పుకొచ్చిన క్రిష్.. ఇప్పుడు సడన్గా, అసలు విచారణకు హాజరు కాకుండానే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయడం అనుమానం కలిగిస్తుంది. ఈ విషయం పై పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బెయిల్ కోసం అప్లై చేసినప్పటికీ, క్రిష్ విచారణకి హాజరుకావాల్సిందే అంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు.
మరి క్రిష్ నిజం గానే డ్రగ్స్ తీసుకున్నారా అనేది తెలియాలంటే.. ఆయన విచారణకు హాజరు కావాల్సిందే. కాగా ఈ కేసు ఎఫ్ఐఆర్ లో ఇప్పటివరకు 12 మంది పేరులను చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం అయితే ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. ప్రధాన నిందితుడు నీల్ విదేశాలకు పారిపోయాడట. అబ్బాస్ అనే వ్యక్తి పబ్ లో డ్రగ్స్ ని సరఫరా చేసాడు.
Next Story