Mon Dec 23 2024 07:18:35 GMT+0000 (Coordinated Universal Time)
Anushka Shetty : పవన్ సినిమా పక్కన పెట్టేసి అనుష్కతో మూవీ స్టార్ట్..
పవన్ కళ్యాణ్ సినిమాని మళ్ళీ పక్కన పెట్టేసిన డైరెక్టర్ క్రిష్. ప్రస్తుతం అనుష్కతో మూవీ..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'హరిహర వీరమల్లు' వంటి పిరియాడికల్ మూవీ అనౌన్స్ చేసి 50 శాతం షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ మిగిలిన యాభై శాతం పూర్తి చేసుకోవడానికి ముప్పతిప్పలు పడుతుంది. అసలు షూటింగ్ కి వెళ్లడమే కష్టం అయ్యిపోయింది. పవన్ ఈ సినిమాకి తప్ప మిగిలిన అన్ని సినిమాలకు డేట్స్ ఇస్తూ పూర్తి చేస్తూ వస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ దొరక్కపోవడంతో క్రిష్ కూడా వేరే ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తూ పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైష్ణవ్ తేజ్తో 'కొండపోలం' తెరకెక్కించి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు క్రిష్. ఇప్పుడు అనుష్కతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారట. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలయ్యి చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీ రూపొందబోతుంది. త్వరలోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నారట.
మరి ఈ మూవీ ఏ జోనర్ లో తెరకెక్కబోతుంది అనేది తెలియాలి. ఇక ఈ మూవీ అనౌన్స్ చేయడంతో హరిహర వీరమల్లు సినిమాని మళ్ళీ పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ఏపీ ఎన్నికలు అయ్యేవరకు మళ్ళీ సినిమాల జోలికి వచ్చేది లేదు. దీంతో వీరమల్లు సెట్స్ పైకి వెళ్లాలంటే తక్కువలో తక్కువ మూడు నెలలు సమయం పడుతుంది. ఈలోపు క్రిష్, అనుష్కతో మూవీ పూర్తి చేయనున్నారు. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఆల్రెడీ 'వేదం' ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ మూవీలోని పాత్ర అనుష్కకి మంచి పేరు తెచ్చిపెట్టింది.
Next Story