Mon Dec 23 2024 07:11:04 GMT+0000 (Coordinated Universal Time)
బలమైన ఎమోషన్స్ తో రంగమార్తాండ ట్రైలర్ రిలీజ్..
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించిన రంగమార్తాండ.. ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది.
టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. మార్చి 22న ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలకు ఈ సినిమా రెడీ అవుతోంది. కాలెపు మధు - వెంకట్ నిర్మించిన ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించిన రంగమార్తాండ.. ఉగాది కానుకగా మార్చి 22న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో ప్రకాశ్ రాజ్.. రంగస్థల నటుడిగా తన గత వైభవాన్నిగుర్తుచేసుకునేలా చూపించారు.
తన కుటుంబ సభ్యులే తన పెద్దరికానికి ఎదురు తిరగడం .. తన కూతురే తనని దొంగగా అనుమానించడం వంటి సంఘటనలు తట్టుకోలేక భార్యతో మరో ప్రయాణాన్ని మొదలుపెట్టడం .. ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. బలమైన ఎమోషన్స్ తో కూడిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించిన ఒక రంగస్థల కళాకారుడి అనుభవాలు .. జ్ఞాపకాలుగా రంగమార్తాండ రూపొందింది. వ్యక్తి జీవితంలోని అనుభూతులు, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే వచ్చిన పలు అప్డేట్స్ తో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. చాలా కాలం తర్వాత కృష్ణవంశీ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఇది ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next Story